ఎప్పుడూ కరోనా గొడవేనా..??
కాస్తయినా ఆటవిడుపు ఉండొద్దా..?
కాసేపు అన్నీ మర్చిపోండి..
సరదాగా ఇదిగో ఇది ప్రయత్నించండ

ఎప్పుడూ కరోనా గొడవేనా..??
కాస్తయినా ఆటవిడుపు ఉండొద్దా..?
కాసేపు అన్నీ మర్చిపోండి..
సరదాగా ఇదిగో ఇది ప్రయత్నించండి..
*నేను కూడ సమాధానాల కోసం ప్రయత్నిస్తున్నాను*
*కనుక్కోండి చూద్దాం*
1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర 2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర 3.కాగితం చుడితే వచ్చే కూరగాయ 4 సమస్యలలో వున్న కూరగాయ 5.రెండు అంకెతో వచ్చే కూరగాయ 6.దారి చూపించే కూరగాయ(దుంప) 7.తాళం చెవిని తనలో దాచుకున్న కూరగాయ 8.కష్టాలలో వున్న కూరగాయ 9.చిన్న పిల్లాడితో వచ్చే ఆకుకూర 10.సగంతో మొదలయ్యే కూరగాయ 11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర 12.వనంలో వున్న ఆకుకూర 13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర 14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ 15.చిన్న పిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ 16.జలచరంతో వున్న కూరగాయ

About the author
Parker

2 thoughts on “ఎప్పుడూ కరోనా గొడవేనా..??<br /> కాస్తయినా ఆటవిడుపు ఉండొద్దా..?<br /> కాసేపు అన్నీ మర్చిపోండి..<br /> సరదాగా ఇదిగో ఇది ప్రయత్నించండ”

  1. Answer:

    మురహరి శైలజ

    1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర – గోంగూర

    2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర – చుక్క కూర

    3.కాగితం చుడితే వచ్చే కూరగాయ – పొట్లకాయ

    4 సమస్యలలో వున్న కూరగాయ – చింతకాయ

    5.రెండు అంకెతో వచ్చే కూరగాయ – బీర, దోస, బెండ.

    6.దారి చూపించే కూరగాయ(దుంప) – బీట్ రూట్

    7.తాళం చెవిని తనలో దాచుకున్న కూరగాయ – కీ..ర

    8.కష్టాలలో వున్న కూరగాయ – చిక్కుడు

    9.చిన్న పిల్లాడితో వచ్చే ఆకుకూర – బచ్చలి

    10.సగంతో మొదలయ్యే కూరగాయ – అర టికార

    11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర – కొత్తిమీర, చుక్క కూర, గోంగూర.

    12.వనంలో వున్న ఆకుకూర – తోట కూర

    13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర – కరి వేపాకు

    14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ – టమోట

    15.చిన్న పిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ – కేర ట్

    16.జలచరంతో వున్న కూరగాయ – సొర కాయ

    Explanation:

    Reply
  2. 1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర :- గోంగూర

    2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర :- చుక్కకూర

    3.కాగితం చుడితే వచ్చే కూరగాయ :- పొట్లకాయ

    4 సమస్యలలో వున్న కూరగాయ :- చిక్కుడుకాయ

    5.రెండు అంకెతో వచ్చే కూరగాయ :- దోసకాయ

    6.దారి చూపించే కూరగాయ(దుంప) :- బీట్రూట్

    7.తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ :- కీరా దోసకాయ

    8.కఫ్టాలలో వున్న కూరగాయ :- చింత చిగురు

    9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర :- బచ్చలికూర

    10.సగంతో మొదలయ్యే కూరగాయ :- అరటికాయ

    11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర :- గోంగూర / కొయ్య తోటకూర

    12.వనంలో వున్న ఆకుకూర :- తోటకూర

    13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర :- కరివేపాకు

    14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ :- టమాటో

    15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ :- క్యారెట్

    16.జలచరంతో వున్న కూరగాయ :- సొరకాయ

    Reply

Leave a Comment